History

నిజాం నిరంకుశత్వంపై పిడికిలెత్తిన అగ్నిశిఖ

"జన సరస్సులో విరిసిన అరుణారుణ కమలమా కాకతీయ రుద్రమ్మకు నీవే ప్రతి రూపమా పసుపురాసే చేతులతో విప్లవాల ముగ్గువేసి తెలంగాణా కే కొత్త సంక్రాంతి ని ఇచ్చినావు"

సుద్దాల అశోక్ తేజ. మానవత్వానికి నిలువెత్తు రూపం. నిర్మల స్వరూపం. అన్యాయాన్ని దహించే అగ్నిశిఖ. వీరోచిత సాహసాలకు ఎక్కుపెట్టిన బల్లెం. అబలలు కాదు సబలలంటూ పోరాట కాన్వాస్ పై నిలువెత్తు నిదర్శనమై నిలిచిన అపర రుద్రమ్మ. శత్రువుల గుండెపైకి గురితప్పని బుల్లెట్. వీరనారి, సాహసవనిత. అజ్ఞాత జీవితాన్ని గడిపినప్పటికీ సింహస్వప్నంలా నిలిచిన ధీరురాలు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన విప్లవ శంఖం. సామాన్యుల హక్కుల కోసం కదం తొక్కిన ధీశాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వికసించిన అగ్నిపుష్పం. ఆమే డా. ఆరుట్ల కమలాదేవి.

చైతన్యానికి మరో పేరు ఆలేరు ప్రాంతం. నిజాం నిరంకుశ దురాగతాలను ఎదురించిన విప్లవ వీరులకు జన్మనిచ్చిన నేల. తెలంగాణ సాయుధ సమరానికి ఊపిరులూదిన పులిగడ్డ. రైతాంగ పోరాటంలో తమదైన ముద్ర వేసిన వారు ఆరుట్ల దంపతులు. ఏ. ఆర్. గా సుప్రసిద్ధులైన అరుట్ల రామచంద్రారెడ్డి కి అన్నివిధాల అర్హురాలైన సహధరంచారిణి, సహకర్మచారిణి ఆరుట్ల కమలాదేవి. తెలంగాణ విమొచన ఉద్యమానికి స్పూర్తినివ్వడమే కాకుండా, దిన జన వికాసానికి కృషి చేసిన మహిళామణి.

నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో పల్లా లక్ష్మీనర్సమ్మ, వెంకటరాంరెడ్డి దంపతులకు 1920 లో కమలాదేవి జన్మించింది. వీరిది మధ్య తరగతి రైతు కుటుంబం. కమలాదేవి అసలు పేరు రుక్మిణి. పుట్టిన ఊరులోనే ఓనమాలు దిద్దుకుంది. పెద్ద బాలశిక్ష చదివింది. ఆ సమయంలో తన పదకొండవ యేట మేనబావైన ఆరుట్ల రామచంద్రారెడ్డి తో వివాహం జరిగింది. ఏ. ఆర్. రుక్మిణి పేరును కమలదేవి గా మార్చారు. ఇందుకు కారణం లేకపోలేదు. జాతీయోద్యమ నాయకురాలైన కమలాదేవి అంటే ఏ. ఆర్. కు చాలా అభిమానం. అందుకే తన భార్య పేరును కమలాదేవి గా మార్చుకున్నారు. పై చదువుల కొరకు తన భార్య ను హైదరాబాద్ లో మడపాటి హనుమంత రావు స్థాపించిన బాలికల ఉన్నత పాఠశాల లో చేర్పించాడు. ఆ రోజుల్లో బాలికల వసతి గృహాలు ఉండేవి కావు. రాజ బహద్దూర్ వెంకట రాంరెడ్డి ని ఒప్పించి ఏ. ఆర్. రెడ్డి హాస్టల్ కు అనుబంధంగా బాలికల హాస్టల్ ను స్థాపింపచేశాడు. కమాలదేవి హెచ్. ఎస్. సి. వరకు అక్కడే చదువుకుంది. చదువు పూర్తి కాగానే తన అత్తగారి ఊరైన కొలనుపాక చేరుకుంది.

ఆ రోజుల్లో కొలనుపాక జాగీరు గ్రామం. కొత్తగా బడి పెట్టాలన్న, గ్రంథాలయం స్థాపించాలన్న నిషేదం ఉండేది. ఏ విధంగానైనా బడి పెట్టాలన్న కోరికను కార్యరూపంలోకి తెచ్చాడు ఏ. ఆర్. వంటశాల పేరుతో నిర్మించిన గదిలో కన్యా పాఠశాలను ప్రారంభించాడు. కమలదేవి ఆ పాఠశాల లో టీచరుగా పని చేస్తూ వచ్చింది. ఏ విషయం జాగీర్దారుకు తెలిసింది. వెంటనే బడిని మూయించాడు. ఆ తరువాత జైన మందిరం యాజమాన్యం తమ ఔదార్యం ప్రకటిస్తూ ఇచ్చిన స్థలంలో (జైన మందిర ఆవరణ) వయోజనులైన మహిళలకు విద్య నేర్పింది కమలాదేవి.

సమాజ పోకడలపై, స్థితి గతులపై చక్కని అవగాహన గల కమలాదేవి ఆంధ్ర మహాసభల్లో భర్తతో పాటు చురుకైన కార్యకర్తగా పాల్గొంది. 1943 లో విజయవాడ లో జరిగిన మహిళా ఆత్మరక్షణ శిక్షణా శిబిరంలో సైనిక శిక్షణ తీసుకుంది. మహిళల హక్కుల కొరకై పో్రాడిన చైతన్యశీలి. 1944 లో అరుట్ల దంపతులకు కొడుకు పుట్టాడు. అభ్యుదయ భావజాలం గుండెల నిండుగా ఉన్న అరుట్ల దంపతులు తమ కొడుక్కి విప్లవ రెడ్ది అని పేరు పెట్టుకున్నారు. అదే సమయంలో జిల్లా లో నిజాంప్రభుత్వం మార్షల్ లా విధించింది. సాయుధ పోరాట యోధులు అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ క్రమంలో అరుట్ల దంపతులు కూడా తమ నెలల పసిగుడ్డు ను సైతం వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈ సంఘటన వాళ్ళ లోని ధైర్యాన్ని, కార్యధక్షతను తెలుపుతుంది. అజ్ఞాతంలో ఉన్న సమయంలో కూడా ఏ సంధర్భంలో పిరికితనాన్ని దరిచేరనీయలేదు. అవసరమైనప్పుడు ఏ. ఆర్. కు ధైర్యం నూరిపోసిన సందర్భాలున్నాయి. ఇందుకు చల్లూరు, బేగంపేట గుట్టల్లో సైనికుల కళ్లు గప్పి ఇబ్రహీంపురం చేరుకున్న ఉదంతం ఓ చక్కని ఉదాహరణ. రహస్య జీవితంలో కొంతకాలానికి కమలాదేవి జ్వరంతో బాధపడింది. అమ్మగారి ఊరైన మంతపురి లో వదిలి వద్దామని వెళ్తున్న సమయంలో ఆలేరు శివారులో కమ్మగూడెం దగ్గర మాటు వేసిన పోలీసులు ఆరుట్ల దంపతులు అరెస్టు చేశారు. ఏ. ఆర్. ను ఖమ్మం జైలుకు , కమలాదేవిని వరంగల్ జైలుకు పంపారు. ఆ తర్వాత కమలాదేవిని ఔరంగాబాద్, సికింద్రాబాద్ జైలుకు మార్చారు. రెండున్నరేళ్ళ కఠిన కారాగార శిక్ష తరువాత 1951 లో విడుదల చేశారు.

మారిన రాజకీయ పరిస్థితులలో సాయుధ పోరాటం లో మడమ తిప్పని పోరాటం చేసిన కమలాదేవి 1952 లో ఆలేరు నియోజకవర్గం నుండి ఎం. యల్. ఏ. గా పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలుపొందారు. 1967 వరకు ఎం. యల్. ఏ. గా అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చారు. 1962 లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం గా ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య నయకుడిగా, కమలాదేవి ఉపనాయకురాలిగా శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. పార్టీ చీలిక తర్వాత 1964 లో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించింది. ప్రజా ప్రతినిధి గా బడూగు బలహీన వర్గాల కోసం శ్రమించిన కమలాదేవి ఆయా సంధర్భాలలో బల్గేరియా, జెకోస్లవేకియా, ఆస్ట్రియా, రష్యా దేశాలు పర్యటించారు. బాధ్యత కలిగిన ప్రజనేత గా ప్రజలకు సముచిత సేవలను అందించారు. తాను చెప్పే, సందేశించే ప్రతి మాటను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఆ క్రమంలో రాజకియ రంగంలో కూడా విరమణ ఉండాలని చెబుతూ వచ్చేవారు. తనకు అరవై ఐదు సంవత్సరాలు నిండగానే స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

ఆదర్శ మహిళగా, అణువణువున ధైర్యన్ని నిపుకున్న ధైర్యవంతురాలిగా, గృహిణిగా పోరాట వనిత గా బహుముఖ ప్రజ్న కలిగిన ఆరుట్ల కమలాదేవి ని కాకతీయ విశ్వవిద్యాలయం 1998 లో గౌరవ డాక్టరేట్ తొ సత్కరించి తనను తాను సత్కరించుకుంది. జీవితంలోని ప్రతి దశను ప్రజా హక్కుల కోసం, అభ్యున్నతి కోసం పంచిన కమలాదేవి జనవరి 1, 2001 న తుది శ్వాస విడిచారు. అరుణతారగా వెలుగుతున్నారు. సమరశీల స్వభావాన్ని నేర్పిస్తూనే ఉన్నారు.

మనిషి భానిస జీవితం దుర్భరం. అందునా నిరంకుశ పాలనలో ఆ జీవితాన్ని తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. మనిషి స్వే చ్చ ను చెమటగా పిండుకొని, భోగ భాగ్యాలను జుర్రుకోవాలనే నియంతల అమానుష క్రీడలు ఎంతో కాలం సాగవు. ఎక్కడొ వీరుడో, వీరవనితో పుట్టి ఆ కరకు రాచరిక శక్తులను నిర్మూలించి స్వేచ్చా సౌఖ్యాలను అందిస్తారు. అట్టి వారిలో డా. ఆరుట్ల కమలాదేవి ఒకరు.

ె లంగాణ మట్ట ి కణాలను కదన యోధులుగా మలిచిన విప్ల వ స ంహం

నిర్దాక్షిణ్య నిరంకుశ పాలనను అంతం చేయడానికి, అమాయక ప్రజల ధన మాన ప్రాణాలను దోచుకుంటున్న పాశవిక శక్తులను నిర్మూలించడానికి సాయుధ పోరాటమే లక్ష్యమని తన ప్రాణాలను కూడా గడ్డి పోచలుగా భావించి రకరకాల సమర వ్యూహంతో పాలకుల గుండెలను గడగడలాడించిన తెలంగాణ విప్లవ సింహం ఆరుట్ల రామచంద్రారెడ్డి. దమన నీతితో, కుటిల వ్యూహాలతో కర్కశ పాశవిక చర్యలతో తెలంగాణ ప్రజల రక్తంతో షవర్ బాత్ చేస్తూ తమ పాలనను దోపిడి వ్యవస్థగా మార్చుకుని అడుగడుగునా జన జీవితాన్ని సంక్షుభిత పరుస్తున్న నిజాం అమానుష పరిపాలనను తన విప్లవ గర్జనలతో తెలంగాణ మట్టి కణాలను వీరa కిశోరాలుగా సాయుధ పోరాటములో ఉరకలు వేయించిన అగ్నిశిఖ ఆరుట్ల రామచంద్రారెడ్డి.

ఏ. ఆర్. గా ప్రసిద్ధులైన ఆరుట్ల రామచంద్రారెడ్డి నల్లగొండ జిల్లా ఆలేరు మండలం పరిధిలోని కొలనుపాకలో రామక్క, రాజిరెడ్డి దంపతులకు 1909 లో రెండో కుమారునిగా జన్మించారు. నిజాం పరిపాలనా కాలమ్లో అతి పెద్ద జాగీరు గ్రామం కొలనుపాక. జాగీరుల పాలన కావడం వల్ల తెలుగు మధ్యమంగా బోధించే పాఠ్శాల లేకపోవడం వల్ల ఉర్ధూ బోధనా భాషగా ఉన్న జాగీరు పాఠశాలలో ఏ. ఆర్. కొన్ని తరగతులు చదువుకున్నాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ వారిని ఒప్పించి భువనగిరిలో చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడ మొదటి ఫారం, రెండవ ఫారం పూర్తి చేశాడు(1926). ఆ తరువాత 1928 లో హైదరబాద్ గోషామహల్ పాఠశాలలో థర్డ్ ఫారం ఉత్తీర్ణుడై 1930 లో నాంపల్లి హైస్కూల్ నుండి మెట్రికులేషన్ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణుడైనాడు.

1930 లో గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహం, జాతీయోద్యమ ప్రభావం రామచంద్రారెడ్డి పై పడింది. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల ఉరికి యావద్దేశం చలించి పోయింది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 'స్వదేశీలీగు' పేరుతో సమావేశాలు జరిగాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి. ఏ. చదువుతున్న రోజుల్లో ఏ. ర్. గాంధీజీ ప్రభావంతో ఖద్దరు ధరించడం ఆదర్శంగా తీసుకున్నాడు. మొదట పెళ్ళి చేసుకోవడానికి విముఖత చూపించినప్పటికీ, పెద్దల ఒత్తిడి మేరకు మనసు మార్చుకున్నాడు. తన మేనమామ కూతురైన రుక్మిణి(ఆలేరు మండలం, మంతపురి గ్రామం) తో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఆదర్శ భావాలు కలిగిన ఏ. ఆర్. పెళ్ళికి కొన్ని షరతులు పెట్టాడు. వరకట్నం ఇవ్వకూడదు. వధూవరులు ఖద్దరు దుస్తులు ధరించాలి. మాంసం, మత్తు పానీయాలు పెళ్ళిలో వాడరాదు. రుక్మిణి ని వివాహానంతరం ్ పై చదువులు అంగీకరించాలి. అన్నట్టుగా నే పై షరతులకు లోబడి పెళ్ళి జరిపించారు. పెళ్ళి లో రుక్మిణి పేరును కమలాదేవి గా మార్చాడు ఏ. ఆర్. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ రోజుల్లో సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాద్యాయ వంటి పేరు పొందిన సంఘ సేవికలు రాజకీయ నాయకులు ఉండేవారు. ఆ స్ఫూర్తితో రామచంద్రారెడ్డి తన భార్య పేరును 'కమలాదేవి' గా మార్చాడు. సమాజంలో విద్యను నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలన్నది ఏ. ఆర్. దృఢాభిప్రాయం. అందునా స్త్రీ విద్య పట్ల ప్రత్యేక చొరవ చూపాడు. మంతపురి పాఠశాలలో పెద్ద బాల శిక్ష పూర్తి చేసుకున్న కమలాదేవిని పై చదువుల నిమిత్తం హైదరాబాద్ తీసుకువెళ్లాడు. అప్పటివరకు అక్కడ బాలికల వసతి గృహాలు లేవు. ఏ. ఆర్. చొరవతో గర్ల్స్ హాస్టల్ ఏర్పాటైంది. అందులో మొదటి బోర్డర్ గా కమలాదేవిని చేర్పించాడు. మెట్రిక్యులేషన్ వరకు ఏ. ఆర్. అందించిన ప్రోత్సాహం తో కమలాదేవి చదువగలిగింది.

తెలుగువాళ్ల కష్టసుఖాలు ఆనాటి ప్రభుత్వానికి తెలిపే ఉద్దేశంతో ఒక ప్రత్యేక సంస్థ ను స్థాపించారు. ఆ భావన తో ఏర్పడ్డ ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం మెదక్ జిల్లా జోగిపేటలో 1930 లో జరిగింది. రావి నారాయణ రెడ్డి నాయకత్వాన రెడ్డి హాస్టల్ కు చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు 60 మైళ్లు సైకిళ్ల పై జోగిపేట వెళ్లారు. అందులో ఏ. ఆర్. ఒక సభ్యుడు. ఆంధ్ర మహాసభలచే ప్రభావితుడైన ఏ. ఆర్. మహాసభ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ వచ్చాడు. దేవరకొండ, ఖమ్మం, సిరిసిల్ల, షాద్ నగర్లలో్ జరిగిన ఆంధ్ర మహాసభల్లో పాల్గొని ఉత్తేజ పూరిత ఉపన్యాసలిచ్చాడు. ఈ సభల స్పూర్తి తో అస్పృస్యత నివారణ కై కృషి చేశాడు. భువనగిరి ప్రాంతంలోని దాదాపు 35 గ్రామాల హరిజనులకు శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ ప్రవేశం కల్పించాడు.

ఆర్య సమాజం, సత్యాగ్రహ ఉద్యమ ప్రభావం వ్ల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించారు. ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి పాడినందుకు విద్యార్థులను సస్పెండు చేశారు. సస్పెండు అయిన వారిలో ఏ. ఆర్. కూడా ఉన్నాడు. ఇక్కడ చదువును కొనసాగించే వీలు లేక పోవడం వల్ల జబల్ పూర్ వెళ్లి బి. ఏ. పూర్తి చేశాడు. చదువు ముగించుకున్న ఏ. ఆర్. తన స్వగ్రామమైన కొలనుపాక చేరుకున్నాడు. అప్పటికే జాగీర్దార్ దురాగతాలకు అంతు లేకుండా పోయింది. జాగీర్దార్ వ్యతిరేక పోరాటానికి ఆరుట్ల సోదరులు నాంది పలికారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడారు.

గ్రంథాలయ ఉద్యమ ప్రేరణ తో గ్రామములో గ్రంథాలయం నిర్మించాలనుకున్నాడు. కానీ అలాంటి నిర్మాణాలకు నిజాం అనుమతి కావాలి. పాఠశాల నిర్మాణం అంటే నిజాం సర్కారు అనుమతివ్వరని భావించి 'రామానుజ కూటం' పేరుతో అనుమతి తీసుకొని గ్రామస్థుల సహకారం తో రెండు నెలల్లో నిర్మాణం చేశాడు. అందులో కమలాదేవి టీచర్ గా బాలికల పాఠశాల నడిపించాడు. ఎలాగైనా పాఠశాల నడిపించాలన్న ఏ. ఆర్. జైన మందిర అధ్యక్షుడు లక్ష్మీచంద్ సహకారంతో జైన మందిర ప్రాంగణంలో బాలికల పాఠశాల ను ఏర్పాటు చేశాడు. స్త్రీ విద్య పట్ల ఏ. ఆర్. కు ఉన్న సదాశయానికి ఏ సంఘటన ఓ చక్కని ఉదాహరణ.

భూస్వాములకు, జమీందార్లకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు నిచ్చింది. పార్టీ ఆదేశానుసారం ఏ. ఆర్. విజయవాడ లో గెరిల్లా శిక్షణ పొందాడు. శిక్షణ పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి భువనగిరి ప్రాంతంలో దాదాపు 500 గ్రామాల ప్రజలను పోరాటానికి సిద్ధపరిచాడు. భువనగిరి నుండి సిద్దిపేట వరకు గ్రామాల్లో పార్టీ నిర్మాణానికి బాధ్యత స్వీకరించి ఆ దిశగా కృషి చేశాడు. తన నాయకత్వంలో అనేక గెరిల్లా దళాలను ఏర్పాటు చేశాడు. ఏ క్రమంలో ఆరుట్ల దంపతులు ప్రజాహిత కార్యక్రమాల్ని నిర్వహించారు.

1948, సెప్టెంబర్ 17 న నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. పోలీసు చర్య అనంతరం రజాకార్ల కేంద్రాలపై ప్రజలు దాడులు చేశారు. ఆ సందర్భంలో ముస్లీం స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించొద్దని ఏ. ఆర్. హితవు పలికాడు. పోలీసుల పట్ల కూడా దౌర్జన్యం చెయ్యొద్దాన్నడు. ఏ. ఆర్. లోని సంస్కారాన్ని పట్టి చూపే సందర్భాలు ఇవి. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీపై నిషేదం విధించింది. ఆ పరిస్థితుల్లో ఆరుట్ల దంపతులు నెలల పసిగుడ్డును వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. చివరకు బహద్దూర్ పేట వద్ద మాటు వేసిన పోలీసులు అరుట్ల దంపతులను అరెస్టు చేశారు. ఏ. ఆర్. ను నల్లగొండ జైలుకు పంపారు. అక్కడి నుండి ఖమ్మం, హైదరాబాద్ జైళ్లకు మార్చారు. జైళ్లలో ఉనంతకాలం చాలా ఇబ్బందులు పడ్డాడు. క్రూరమైన శిక్షలు అనుభవించాడు. కమ్యూనిస్ట్ పార్టీ లో సుదీర్ఘ చర్చల అనంతరం హైకమాండ్ సాయుధ పోరు నిలిపివేయాలని పిలుపునిచ్చింది. 1952 లో జైలు నుండి విడుదలయ్యాడు. పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ తరపున రామాయం పేట అసెంబ్లీ స్థానం నుంచి నిలబడి ఎం. యల్. ఏ. గా 1953 లో ఉప ఎన్నికలలో విజయం సాధించాడు. ప్రజా ప్రతినిధి గా సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశాడు. కొలనుపాక సబ్ స్టేషన్, చెక్కర ఫ్యాక్టరీ ఏర్పాటు ఇలాంటివే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. లంబాడి రైతుల ఉద్యమం, దాతారుపల్లి భూపోరాటం, మల్లపురం, అడ్డగూడూరు బీద రైతుల పోరాటాల్లో ముఖ్య పాత్ర ను పోషించాడు.

త్రికరణ శుద్ధిగా తాను చెప్పిందే ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచిన ప్రజల మనిషి. స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేసిన చైతన్యశీలి. ముక్కుసూటితనం ఆయన నైజం. ఉద్రేకాన్ని రగిలించే ఉపన్యాసలతో ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం లో దిట్ట. సమస్యల పరిష్కారంలో అలుపు లేని పోరాటం చేసిన యోధుడు. బ్రతికినంత కాలం ప్రజలతో మమేకమై అనాథ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ధార పోసిన త్యాగ పురుషుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి. అలాంటి ఏ మట్టి బిడ్డ 26-08-1985 లో తుది శ్వాస విడిచారు. అరుణారుణ పతాకమై నేటికీ ప్ర్జలల గండెల్లో రెపరపప లాడుతున్నాడు. జీవితాల్లో ఓటమి ప్రవేశించకుండా సందేశిస్తూనే ఉన్నాడు.

DR. Arutla Kamaladevi

An Iconic lady, A life size reflection of Humanity, A fire power that burns injustice and a guided arrow and bullet straight on to the enemies hearts. A courageous lady. A lady who proved that ladies are not disabled but, they are abled. A Lion in the dreams of the Authorities against whom she fought for the basic rights of common people though she lived in exile for this cause.

A fully blossomed Fire Flower and Fire Power in Telangana Armed Struggle. She is none other than Dr. Arutla Kamala Devi.

In the words of the famous lyricist Mr. Suddala Ashok Teja, she is

"జన సరస్సులో విరిసిన అరుణారుణ కమలమా కాకతీయ రుద్రమ్మకు నీవే ప్రతి రూపమా పసుపురాసే చేతులతో విప్లవాల ముగ్గువేసి తెలంగాణా కే కొత్త సంక్రాంతి ని ఇచ్చినావు"

ALER region is known for its ever active and bubbling life. This is a place that has given birth to many Revolutionary heroes that’s stood up against the Atrocities of Aristocratic and Satonic Nizam’s rule.

This is the land that has given life to Telangana Armed Struggle. The Arutla couple have put their own unique stamp in the struggle of Telangana Ryots. Dr. Arutla Kamala Devi is a true and befitting life partner to Sri. Arutla Ramachandra Reddy, popularly known as AR,sharing his Dharma and Karma.

Besides pumping in life into the Telangana Liberation Movement, she has also striven for the development and enlightenment of the down trodden.

She was born in 1920 in Manthapuri village of Aler Mandal, Nalgonda District to Palla Laxmi Narsamma and Venkatarami Reddy who belong to a middleclass Rytu family. Rukmini was the name given to her by parents. She started learning alphabets in the village where she was born and studied upto “Peddabala Shiksha”. At the age of Eleven. She was married to her maternal uncle Arutla Ramachandra Reddy. AR has changed her name from Rukmini to Kamala Devi because of his respect to the National Movement leader Kamala Devi and then he has admitted her in Madapati Hanumantha Rao Girl’s High School at Hyderabad for further studies.

There were no girls hostel in those days. AR has convinced Raja Bahabur Venkatarami Reddy to start a GIRLs’ HOSTEL as an affiliate to Reddy hostel and admitted Kamala Devi therein, and she was the first girl boarder in that Hostel. She has completed her Secondary School there itself and then reached her in-laws place Kolanupaka.

Kolanupaka was a Jagir Village where no schools could be opened because of Restrictions imposed by the Jagirdar. AR was fond of starting a School in Kolanupaka. To circumvent the Restrictions prevailing then, AR got a Kitchen Hall constructed and converted the same in to a Girls School where Kamala Devi was working as a Teacher. Having come to know of this, the Jagirdar got the School closed. However, with the noble support of the local Jain Mandir’s management who have provided space in their temple compound, Kamala Devi started teaching to the local womenfolk.

She has developed an excellent understanding of the contemporary society and situations and has taken active role as a worker in the activities of Andhra Maha Sabha. Has taken training in female self defense in the program conducted at Vijayawada during 1943. She was a dynamic personality who fought for the women’s rights. AR couple were blessed with a male child in 1944 and named him as Viplav Reddy in line with their philosophy.

It was at that time that the Nizam Government has imposed Martial Law in the District forcing all those who participated in the armed struggle against Nizam to go into exile. AR couple also were forced into exile leaving their months old hapless child behind. This is a representation of their Courage and dedication to what they believed. Kamala Devi never allowed the courage drop down while in exile and whenever called for, she was there to infuse courage and confidence in AR. The incident of their reaching Ibrahimpuram hoodwinking the police force at Challuru and Begumpet is a beautiful example to share.

While in exiled Kamala Devi faced serious health problems and decided to reach her parental place for care and protection. On their way to Manthapuri, police have arrested both AR and Kamaladevi at Kammagudem, outskirts of Aleru and sent AR to Khammam Prison and Kamaladevi to Warangal Prison. Therefrom they shifted Kamaladevi to Aurangabad and then to Secunderabad. After two and half years of harsh imprisonment, she was released in 1951.

A natural fighter, who never showed her back to the opponents, in the changed political scenario has contested to the position of MLA from Aleru Constituency in 1952 and won the elections with a large majority. She has continued her run unopposed till 1967. During 1962, Communist Party was the main opposition in the Assembly and Putchalapalli Sundaraiah was the Main Opposition Leader and Kamala Devi held the position of Dy Opposition Leader. After the Party got split in 1964, she was elected as the Main Opposition Leader , in the Assembly, creating History.

Striving for the welfare of weaker sections in the society, she has toured Countries like Bilgaria, Czeckoslavakia, Austria and Russia. She behaved as a responsible people leader throughout, practicising whatever she preached. One of her preachings was that political leaders too should have retirement and in line with this philosophy, she has retired from politics as soon as she attained the age of 65.

During 1998, Kakathiya University has honored itself, by honoring Kamala Devi, who is an icon of a Model Woman, a Personification of Courage, courage having filled every bit of her body and mind, a proven ideal house-wife and a fighter throughout, with an Honorary Doctorate. Having spent every phase of her life for the rights and development of people, Dr. Kamala Devi left on her journey beyond this life on First January, 2001 and is sparkling in the horizons as a bright red star showing path for fighting for rights and development.

Slavery is a curse. That too in an inhuman dictatorial rule, the very thought make one shiver. The Satonic mpleasure of people enjoying the sweat and blood of innocent people will not continue forever. There may be a birth of a heroic person a male or a female to fight and end this blood bath and give freedom and liberty to the suffering lot, and Dr. Kamala Devi is one among them.

Arutla Ramachandra Reddy

To end inhuman dictatorial rule, to destroy the satanic powers that are robbing the life and respect of innocent people, believing that armed struggle is the only way, not caring for his own life A Revolutionary Lion that has roared at the rulers. That was none other than Sri. Arutla Ramachandra Reddy. Sri. Arutla Ramachandra Reddy was a flame of fire who turned the sands of Telangana into warriors making them run with fervour to fight against Nizam’s inhuman rule with unethical and dictatorial strategies enjoying showers of blood of the people of Telangana.

Sri. Arutla Ramachandra Reddy, popularly known as “AR” was born as 2nd son to Ramakka and Raja Reddy of Kolanupaka in 1909 which is in the Aler Mandal of Nalgonda District. Kolanupaka village, which was a large Jagir in Nizam’s rule, did not have a school in Telugu medium forcing him to start his education in a Urdu Medium School in the Jagir in the initial stages. Thereafter, much against the wish of his parents, having convinced them, he has proceeded to Bhuvanagiri to continue his education. By 1926 he has completed his education up to 1st and 2nd forms He has passed his 3rd form examination in 1928 from Goshamahal School at Hyderabad and then on he has passed his Matriculation Examination in 1st class from Nampally high school in 1930.

AR got influenced by the “Satya Graha” and “National Movement“ started by Gandhiji in the same year. The whole Nation got shocked at death penalty executed by British on patriots like Bhagat Singh, Raj Guru and Sukh Dev. This led to organizing a meeting in the name of Swedish League against British rule. Which had an impact on Shri AR. While being a student of Osmania University pursing BA, influenced by of Gandhiji’s philosophy, AR started wearing “Khaddar”.

Though not inclined for marriage initially, AR has changed his mind due to pressure brought on him by elders. He has accepted to marry Ms. Rukmini of Manthapuri village of Aler Mandal who happens to be his own maternal uncle’s daughter. However having modern thoughts, AR has imposed certain conditions for consummation of this marriage. They are: a. No Dowry (Varakatnam)

b. Both bride and bridegroom should wear only Khaddar (Cotton) clothing in the marriage c. Not to use liquor and Non-Vegetarian in the marriage d. Rukmini the prospective bride should be allowed to pursue her education.

The elders have agreed for all this and the marriage were consummated. During the marriage, he has changed the name of Rukmini as Kamala Devi. There is a reason behind this. In those days there are famous personalities engaged in the cause of the society like Sarojini Naidu, Kamaladevi Chattopadhyay. Etc. This is what has influenced AR to change his wife’s name as Kamaladevi. AR’s very strong conviction was that the number of people getting education should increase and has taken special interest and initiative in the area of FEMALE EDUCATION.

He has taken Kamaladevi to Hyderabad for higher education who has by then just finished her “Peddabala Shiksha” at Manthapuri School. There were no girl’s hostels. It is with the initiative of AR, a GIRLs’ HOSTEL was started Kamaladevi was the first boarder there.

With the support and encouragement given by AR, Kamaladevi could pursue her education upto Matriculation.

To keep the then Government informed about the trials and tribulations of Telugu people, an organization in the name of “Andhra Maha Sabha“ was started and its maiden meeting was held at Jogipet of Medak district in the year 1930. About 25 students belonging to Reddy hostel have travelled 60 miles on bicycles under the leadership of Ravi Narayana Reddy. AR was one of them. Having got influenced by the Andhra Maha Sabha meetings AR was taking active part in the Sabha’s programs. He has given inspirational speeches in Andhra Maha Sabha meetings at Devarakonda, Khammam, Sirisilla and Shadnagar . With the inspiration gained from these meetings, he has acted for abolition of untouchability and has arranged entry for Harijans of 35 villages of Bhuvanagiri area into Yadagiri Laxmi Narasimha Swamy temple.

As a student of Osmania University, he was one of those suspended for defying the Government orders and singing Vandemataram under the influence of Arya Samajam and Satya Graha initiatives.

Since as a result of this suspension he could not continue his education in Osmania, AR has gone to Jabalpur and completed his BA and returned up his native place Kolanupaka. By then the atrocities of the Jagirdhar has grown unabated and it is Arutla brothers who have laid foundation for struggle against Jagirdhari system and fight against the system of bonded labour.

Having got inspired by Grandhayala Udyamam(Library Movement) he wanted to build a Library.But, then, such construction needs permission from Nizam’s and knowing that, Nizam will not permit such constructions he has taken permission in the name of Ramanujakutam. With the active cooperation of villagers, he has completed the construction in just 2 months and has run a girls’ school with Mrs. Kamala Devi as Teacher. With the support and cooperation of Mr. Laxmi Chand, who was the President of ‘A.R. Jain Mandir’ who also was keen in running a girl’s School. AR has started Girl School in Jain Mandir compound. This is one example for AR’s commitment for promoting female education.

At this time Communist Party has given a call to get ready for a struggle against the rule of Landlords, Jamindhars and Nizam’s Government. In response to this, AR got trained in Guerilla warfare at Vijayawada. After due completion of his training he returned and has prepared people from 500 villages of Bhuvanagiri area for the struggle. Then he has taken upon himself the responsibility of building up the PARTY in all the villages from Bhuvanagiri to Siddipet and worked in that direction relentlessly. He has built up many Gorilla sheds under his leadership. AR and his wife have not lost sight of importance of focusing on the welfare programs for the people and have conducted many programs for the welfare of people.

When Nizam Surrended to Indian Union on 17th Sept 1948 and when people started attacking Jagirdhars AR has swung into the fray and appealed to everybody not to behave uncivilized/and inhuman against Muslim women and not to attack the Police forces. These are the indications of the Samskara and respect he has carried with himself for all people.

After Hyderabad dynasty merged itself with Indian Union, Communist Party was banned. In these circumstances, Arutla couples have gone underground leaving behind their ‘Months Old Child’. However, they were ambushed and arrested by Police at Bahadurpet and AR was sent to Nalgonda Jail where from he was moved to Khammma and Hyderabad Jails, in the process, AR had to go through innumerable hardships and punishments.

As a result of a call from Communist Party High Command to stop arm struggle which wa the outcome of prolonged internal Party Discussions, AR was released from Jail in 1952. He has contested from Ramayampet Assembly Constituency during the by-elections of 1953 representing People’s Democratic Front and won the Election. As a people representative he has strived to fill light into the lines of common people. He has been instrumental in establishment of Kolanupaka substation, Sugar Factory and countless developmental activities, He has playeda major role in Lambadhi Ryot Movement Dhatharupalli land struggle, Mallapuram, Addaguduru poor Ryot struggles.

Whole of his life he followed the principle of Trikaranasudhi by saying what he though and doing what he said and stood as an inspirational model to be a people’s man. He was a person who had vibrantly worked for spread of female literacy. He was a symbol of STRAIGHT FORWARDNESS. Was an Expert in giving lectures in rousing emotions and bringing activism in people. A tireless solider in fighting for solutions for people’s problems. AR was a person who has sacrificed his entire life to be with people and among the people to bring light in the lives of poor and hapless people. He was a leader who was breathing in and breathing out the interest of hapless and helpless down trodden people and had his last breath on 26.08.1985 and remains a fire flame and a Red Flag in the hearts of all the people for whom he has strived whole of his life.

Latest News